ఎస్బీఐ న్యూ ఇయర్ కానుక
sureshsuresh | 30 Dec 2019, 08:45 PM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు న్యూ ఇయర్ కానుక అందించింది. ఎర్నర్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ ( ఈబీర్ ) ను మరోసారి 25 బీపీఎస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది. దీని వల్ల ఈబీఆర్ 8. 05 నుంచి 7. 80కి దిగివస్తుందని పేర్కొంది. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఎస్బీఐ వెల్లడించింది. కాగా ఎస్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల హోమ్ లోన్ వినియోగదారులకు ఈఎంఐ భారం తగ్గనుంది.